క్రికెట్ ప్రేమికుల్లారా మీ కోసమే

BCCI భారత క్రికెట్ టీమ్ గతంలో ఆడిన మ్యాచులను కరోనా కారణంగా మళ్లీ ప్రసారం చేయబోతున్నట్టు వెల్లడించింది. 2000 ప్రారంభం నుంచి అంటే దాదాపు 20ఏళ్ల భారత క్రికెట్ మ్యాచ్‌ల హైలెట్స్ ఏప్రిల్ 7 నుండి ప్రసారం కాబోతున్నాయని BCCI సోమవారం ప్రకటించింది. మ్యాచుల హైలెట్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు ప్రతిరోజు ప్రసారం కాబోతున్నాయి. STAY HOME SAFE HOME నినాదాన్ని బలపరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.