నవజాత శిశువులకు ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా టీకాలు వేసేవారు. ముఖ్యంగా క్షయ వ్యాధి సంక్రమించకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి టీకా వేయించేవారు. ఆ కాలంలో భుజానికి టీకా వేస్తే ఓ మచ్చలా గుర్తుండి పోయేది. అలాంటి వందేళ్ల నాటి బీసీజీ (బాసిల్లోస్ కాల్మెట్టే గురిన్) వ్యాక్సిన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా చర్చానీయంశమైంది.
కరోనా వైరస్ కాటుకు ముఖ్యంగా రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు బలవుతున్నారు. గతంలో రోగాల బారిన పడినవారు, వృద్ధులు, పౌష్టికాహారం లోపంతో బలహీనంగా ఉండేవారు. వైరస్ సంక్రమించిన తరువాత తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి వారికి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే వైద్యాన్ని అందిస్తున్నారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో పాటు యాంటిబైటిక్ అజిత్రోమైసిన్ ఔషదాలను అందిస్తున్నారు. మరోవైపు వందేళ్ల నాటి బీసీజీ వ్యాక్సిన్‌పై కూడా ప్రపంచ దేశాలు కరోనా వైరస్ చికిత్సకు ప్రయోగాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో అసలు బీసీజీ వ్యాక్సిన్ కథకమామీషు తెలుసుకుందామా..
బీసీజీ వ్యాక్సిన్ అంటే ఏమిటీ?
బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బిసిజి) ఒక టీకా. క్షయ (టిబి) వ్యాధి నయం చేయడానికి ఈ టీకా వేస్తారు. ఆరోగ్యకరమైన శిశువులకు పుట్టుటకు దగ్గరగా ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ టీకాను ఇంజక్షను రూపంలో ఇస్తారు. టీబీకి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతారు. ఈ వ్యాక్సిన్‌ను మూత్రాశయ క్యాన్సర్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. ఈ టీకా ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన రోగనిరోధక చికిత్సలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ టీకా ఉపయోగాలు, ప్రభావాలనేవి వ్యక్తి వ్యక్తికి మారవచ్చు. ఈ టీకాను ఉపయోగించే ముందు Pulmonologist ను సంప్రదించడం అనివార్యం.
కరోనా వైరస్‌ను నియంత్రించడంలో బిసిజి టీకా సమర్ధవంతంగా పనిచేస్తుందా?
నవజాత శిశువులకు బిసిజి టీకాలు వేస్తున్న దేశాల్లో కరోనా వైరస్ తో ప్రమాదం తక్కువగా ఉన్నట్టు వాదనలు వినవస్తున్నాయి. బిసిజి టీకా వినియోగించని దేశాలలో వైరస్ వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంది. అమెరికా, ఇటలీ, స్పేయిన్ తదితర దేశాల్లో కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భారత్, బ్రెజిల్‌తో పాటు జపాన్ దేశాలలో గడిచిన 60 ఏళ్లపై నుంచి నవజాత శిశువులకు బిసిజి టీకా వేయడం జరుగుతుంది. అందుకే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
బిసిజి టీకా వేయించుకున్న వారిలో కరోనా వైరస్‌తో పోరాడే రోగనిరోధక శక్తి కొంత వరకు ఎక్కువగా ఉంటుందనేది ఒక అధ్యయనంలో తేలింది. అయితే ఇది బిసిజి ఇంజక్షన్ కారణం ప్రభావమా లేక సాధారణంగానే వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఉందా అనే విషయంలో స్పష్టత లేదు.
బిసిజి వ్యాక్సిన్‌పై సర్వత్రా చర్చ.
ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ప్రాణాంతక కరోనా వైరస్ కు చికిత్సగా బిసిజి టీకా విషయంలో చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా మనదేశంలో పుట్టిన ప్రతి శిశువుకు బిసిజి ఇంజక్షన్ వేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే కాబోలు మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందనడానికి వాదనలు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ వాదనల్లో వాస్తవం ఎంత అనేది ప్రయోగాత్మకంగా అమలు చేస్తేనే ఫలితం తేలుతుంది.
బిసిజి టీకా వేస్తున్న దేశాల్లో కరోనా వైరస్‌ను తట్టుకునే రోగనిరోధక శక్తి ఉంటుందని చెప్పడానికి కొన్ని వాదనలను వైద్యులు ప్రస్తావిస్తున్నారు. ఇరాన్లో 1984 నుంచి బిసిజి టీకా వినియోగంలో ఉంది. అక్కడ కరోనా వైరస్ మృత్యురేటు 19 శాతంగా నమోదు అయ్యింది. అలానే 1946 నుంచి జపాన్‌లో బిసిజి టీకా వినియోగంలో ఉండగా, అక్కడ కరోనా వైరస్ ద్వారా చనిపోయిన వారు 0.5 శాతం ఉన్నారు. బ్రెజిల్లో 1927 నుంచి బిసిజి టీకా వాడుతుండగా, అక్కడ కరోనా మరణాల రేటు 0.2 శాతంగా నమోదు అయ్యింది.
బిసిజి వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కరోనా వైరస్‌కు బిసిజి వ్యాక్సిన్ మందు కాదు. అది కేవలం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏ దేశంలో అయితే బిసిజి వ్యాక్సిన్ వినియోగంలో ఉందో అక్కడ కరోనా వైరస్ మృత్యురేటు తక్కువగా ఉంది. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను ఎదుర్కోడానికి రోగనిరోధకశక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే ఈ విషయంలో కూడా పరిశోధన జరుగుతోంది.
ఆస్ట్రేలియాలో కరోనాపై బిసిజి టీకా ప్రయోగం…
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్‌కు అడ్డుగోడగా నిలిచే బిసిజి వ్యాక్సిన్‌పై ఆస్ట్రేలియా ప్రయోగాన్ని ప్రారంభించింది. మెల్బోర్న్లో హెల్త్ కేర్ ఉద్యోగులపై బిసిజి టీకాను ప్రయోగించారు. అయితే వారు కరోనా సంక్రమిత రోగులు కాదు. మున్ముందు వారికి కరోనా వైరస్ సంక్రమించకుండా రక్షణ కోసం బిసిజి టీకా వేశారు.
BCG టీకా ఉపయోగాలు చాలా ఉన్నాయని పోలియో నిర్మూలన కోసం సుడాన్లో వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలకు (CDC,Atlanta,USA) మరియు WHOలకు కన్సల్టెంట్‌గా పని చేసిన డాక్టర్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి అంటున్నారు. అంతే కాకుండా పోలియో నిర్మూలన వ్యూహాలను విజయవంతంగా అభివృద్ధి చేసి అమలు చేశారు.
డాక్టర్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి, ఎండి, ఫ్యామిలీ మెడిసిన్ మరియు జెరియాట్రిక్ స్పెషలిస్ట్. MS (కమ్యూనిటీ హెల్త్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్).
YSRCP USA convenor
YSRCP NRI Doctors wing president.