జంట నగరాల్లో సుందరీకరణ పనులు చకచకగా

కరోనా కాలంలో హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్మాణం, కూడళ్లలో సుందరీకరణ పనులు చకచకగా సాగుతున్నాయి. జంట నగరాల్లో ప్రధాన రహదారులు మాత్రమే కాదు, లాక్డౌన్ సమయంలో ఫాస్ట్ ట్రాక్ జంక్షన్ & ట్రాఫిక్ ఐలాండ్ మెరుగుదలకు మంత్రి KTR ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగర వాసుల్లారా త్వరలో మీరు లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆహ్లాదకరమైన ఆశ్చర్యాలు మీ ముందు కనువిందు చేయనున్నాయి.