APలో “మత్స్యకార భరోసా” కార్యక్రమం ప్రారంభం

కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, కష్టాలు ఉన్నా సరే మన మత్స్యకారుల కష్టాల నుంచి కాపాడాలని “మత్స్యకార భరోసా” పథకంను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి YS జగన్మోహన్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడి మోహంలో వెలుగులు కనిపించేలా మత్స్యకార సోదరులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పథకం CM YS జగన్మోహన్ ప్రారంభిస్తున్నామన్నారు.

నాడు ఇవ్వాల్సిన అవసరం లేదన్నప్పటికీ..

గత ఏడాది మే 30న అధికారంలోకి వచ్చాం కానీ అప్పటికే చేపల వేట నిషేధ సమయం దాదాపు ముగియడంతో ఆర్థిక సహాయం చేయకపోయినా పర్వాలేదన్న సలహాలు వచ్చాయి. అయినా సరే గత ఏడాది నవంబరులో మత్స్యకార దినోత్సవం రోజున ‘మత్స్యకార భరోసా’కు శ్రీకారం చుట్టాం. అందుకే ముమ్మడివరంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టామన్నారు.

ఆ డబ్బు ఇప్పటికీ రాలేదు.

గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మత్స్యకారులు తమ బాధలు చెప్పుకున్నారు. గతంలో జీఎస్‌పీసీ డ్రిల్లింగ్‌ వల్ల 13 నెలలు ఉపాధి లేక నష్టపోయిన మత్స్యకారులకు ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదని వాళ్లు చెప్పినప్పుడు.. వారికిచ్చిన మాట ప్రకారం గత నవంబరులో రూ.70.53 కోట్లు వారికి పరిహారం చెల్లించాము.

పాకిస్థాన్‌ జలాల్లోకి ప్రవేశించారని, మన వాళ్లను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పాదయాత్రలో నాకు చెప్పారు. మనం అధికారంలోకి వచ్చాక మన ఎంపీలతో ఒత్తిడి తీసుకువచ్చి వారిని విడుదల చేయించాము. ఇంకా వారు జీవనం కొనసాగించడానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేసాము. మొన్న కరోనా కారణంగా గుజరాత్‌లో 4500 మందికి పైగా మత్స్యకారులు చిక్కుకుపోతే వారి ఇబ్బందులు తెలిసిన వెంటనే తోడుగా ఉండడానికి గుజరాత్‌ సీఎంతో పాటు, కేంద్ర మంత్రులతో మాట్లాడి రూ.3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారందరినీ సురక్షితంగా తీసుకురాగలిగాము.ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేటపై ఉండే నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడూ ఇచ్చే వారు కాదు. ఇచ్చినా కూడా అరకొరగా, అందరికీ ఇచ్చే వారు కాదు. కరోనా కష్టాలు ఉన్నా కూడా మే 6న 1,09,231 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నాము. అలాగే డీజిల్‌ సబ్సిడీ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదని పాదయాత్రలో చెప్పారు. దీంతో డీజిలు సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కు పెంచాము. మెకనైజ్డ్‌ బోట్‌కు 3వేల లీటర్లు, మోటరైజ్డ్‌ బోటుకు నెలకు 300 లీటర్లు ఇస్తున్నాము. మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే ఇచ్చే పరిహారం రూ.5 లక్షలు సరిపోవని రూ.10 లక్షలకు పెంచాము.మత్స్యకారుల జీవితాల్లో శాశ్వతంగా మార్పు రావాలని.. గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలస పోకూడదని, శాశ్వత పరిష్కారంగా, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతో కృషి చేసి ఎనిమిది మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు కట్టబోతున్నాము.

శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్లు రాబోతున్నాయి.