భవదీయుడు భగత్‌సింగ్‌ ఫస్ట్‌ లుక్

భవదీయుడు భగత్‌సింగ్‌ ఫస్ట్‌ లుక్

పవర్‌స్టార్‌ అభిమానులకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌. పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 2 వ సినిమా తెరకెక్కనుంది. పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2 న ప్రీ లుక్‌ రిలీజ్‌ చేసిన చిత్రబృందం ఇవాళ ఫస్ట్‌లుక్‌ షేర్‌ చేసింది.

చిత్రం పోస్టర్‌తోపాటు టైటిల్‌ను రివీల్‌ చేస్తూ ట్వీట్‌ పెట్టింది. ఈ సినిమాకు *భవదీయుడు భగత్‌సింగ్‌* టైటిల్‌ ఖరారు చేసింది. ఓ సామాజికకోణం కథాంశంగా తెరకెక్కనున్న ఈ మూవీలో పీకే పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తారు.

గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత హరీశ్‌ – పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మరో చిత్రమిది. మైత్రి మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌, రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.