కరోనా టైమ్స్ ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలు

భోపాల్ నగరంలో ఉంటున్న ఓ కుటుంభంలో కరోనా సమయంలో తండ్రి ఇరాన్‌లో చిక్కుకున్నారు, కానీ కుమార్తె సిద్ది అస్నాని మన దేశంలోనే సొంతూల్లో ఉండిపోయింది. రెండేళ్ల లోపున్న ఆ చిన్నారిది గురువారం నాడు పుట్టినరోజు కావడంతో భోపాల్ పోలీసులు బహుమతితో ఇంటికి వచ్చారు.

భోపాల్ పోలీసు విభగంలో పని చేస్తోన్న పోలీస్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ లూనాభట్టి, ప్రొబెషనర్ డిఎస్పి
రిచా జైన్ ప్రత్యేకమైన చొరవ తీసుకొని, తన సిబ్బందితో కలిసి అమ్మాయి ఇంటికి బహుమతి కేకు తీసుకుని వెళ్లి సంభ్రమాశ్చర్యాల్లో ముంచేశారు. ఆ చిన్నారి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి జీవితంలో మరపురాని పండగ రోజును ఘనంగా నిర్వహించారు.