ఈ రోజు దివంగత దర్శకులు..నటులు..నిర్మాత దాసరినారాయణ రావుగారి 77 వ జయంతి సందర్భంగా గా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఉన్న దాసరి విగ్రహానికి ప్రముఖ నిర్మాత దాసరి అరుణ్ కుమార్ కోడి పద్మ కొమర వెంకటేష్ రాజేంద్ర కుమార్ బంగారు బాబు పి డి ప్రసాద్ రామసత్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ ” ఈ రోజుని డైరెక్టర్స్ డేగా గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రకటించింది. ఈ కరోనా వల్ల డైరెక్టర్స్ అందరూ లేకుండా సింపుల్ గా చేయాల్సిన ఘనత మా గురువు దాసరికే చెల్లిందని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలో దాసరి పేరు గుర్తుండేలా వచ్చే ఏడాది బర్త్ డేకి పలు మంచి పనులు చేస్తామని వెల్లడించారు సి.కళ్యాణ్.
అనంతరం కొమరం వెంకటేష్ మాట్లాడుతూ దాసరి లాంటి మంచి మనసున్న వ్యక్తులు అతి అరుదుగా కనిపిస్తారని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా దాసరితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాకు దేవుడితో సమానం దాసరి. ఆయన లేని లోటు సినీ పరిశ్రమకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ దాసరి నారాయణ రావు లాంటి దర్శకులు ఇకపై సినీ పరిశ్రమలో వస్తారో రారో తెలియదు. ఆయన మా గురువు అవ్వడం మా అదృష్టమని చెప్పారు. సంక్రాంతి..దసరా పండుగల్లాగే దాసరి జయంతిని ప్రతి ఏటా పండుగలా నిర్వహిస్తామని తెలిపారు.