నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు బీజేపీ పిలుపు

నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు బీజేపీ పిలుపు

రేపు దేశ వ్యాప్తంగా ధ‌ర్నాల‌కు దిగుతామ‌ని బీజేపీ ప్ర‌క‌ట‌న చేసింది. ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం రాష్ట్రంలో చోటు చేసుకున్న హింస‌పై బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, కార్యాల‌యాల‌పై టీఎంసీ కార్య‌క‌ర్త‌లు దాడులు చేశార‌ని మండిప‌డుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే రేపు దేశ వ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు బీజేపీ పిలుపునిచ్చింది. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ దేశ వ్యాప్తంగా త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వారి ప్రాంతాల్లో ధ‌ర్నాల‌కు దిగుతార‌ని వివ‌రించింది.