దేశ వ్యాప్తంగా BJP ఫీడ్ ఫుడ్ కార్యక్రమం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను ఆధిగమించేందుకు ‘ఫీడ్ ఫుడ్’ కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరంభించారు. సామాన్యులకు నిత్యావసరాలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు పిలుపు నిచ్చారు. అందులో భాగంగా ఇవాళ ఒడిస్సా, కేరళ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల బీజేపీ కార్యవర్గంతో మాట్లాడారు.