ఫీడ్ ఫుడ్ ఆంటోన్న కమలం అధ్యక్షుడు

కరోనా వైరస్ అవగాహనపై ఓ కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేపట్టారు. ఢిల్లీలోని తన నివాసంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో రోజువారీగా కూలీలు తినడానికి తిండి దొరకని వాళ్లందరికీ ఆహారం అందించాలని బీజేపీ అధ్యక్షుడు కార్యకర్తలకు సందేశం పంపారు. బీజేపీ కార్యకర్తలు స్థానికంగా ఎవరన్నా ఆకలితో బాధపడుతుంటే వారందరికీ ఆహార పదార్థాలను ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫీడ్ ఫుడ్ అనే కార్యక్రమాన్ని ఢిల్లీలో చేపట్టారు.