పేదలకు నిత్యావసరాలు పంపిణీ: బీజేపీ కార్యదర్శి సత్య కుమార్

దేశంలో కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు ఆహారం కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే కమలం పార్టీ పిలుపుతో
జనాల ఆకలి తీర్చేందుకు నిత్యావసర వస్తువులు ‘మోడీ కిట్’ పేరుతో సామాన్యులకు బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ అందజేయడం జరిగింది. తెలంగాణ బిజెపి కార్యకర్తల సహాయంతో హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ డివిజన్ సమీపంలోని మురికివాడల్లో నివసిస్తోన్న పేదలకు పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో అత్యధికంగా వలస కూలీలు నివాసం ఉంటున్నారు.