అమెరికాలో సామూహిక ఖననాలు

న్యూయార్క్ నగరంలోని హార్ట్ ఐలాండ్ లోని ఓ సామూహిక సమాధిలో డజన్ల కొద్దీ మృతదేహాలను ఖననం చేశారు. కరోనావైరస్ కారణంగా ఈ అత్యాధునిక నగరంలో మరణించిన వ్యక్తుల సంఖ్య 5,000కు పెరిగింది. న్యూయార్క్‌లో అత్యధిక మరణాలు సంభవించడంతో మృతదేహాలను హార్ట్ ద్వీపంలో కందకాలలో పాతిపెట్టారు.
కనీసం జీవితంలోని చిట్టచివరగా జరగాల్సిన అంత్యక్రియలు సజావుగా/పద్ధతిగా చేసేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదంటే ఆ దారుణ స్థితిగతులు చెప్పనవసరం లేదు.