జలుబు, దగ్గుకు దివ్యౌషధం

క‌రోనా వైర‌స్ ప్ర‌ధాన ల‌క్ష‌ణం జ‌లుబు,ద‌గ్గు. అయితే సాధారణంగా జ‌లుబు, ద‌గ్గు అనేని సాధార‌ణంగా వ‌స్తుంటాయి. ఈ రెండు మనకు వ‌చ్చినంత మాత్రాన భ‌యాందోల‌న‌ల‌కు గురికాకుండా గృహ‌వైద్యంతో న‌యం చేసుకోవ‌చ్చు. తుల‌సి ర‌సం జ‌లుబును దూరం చేస్తుంది.
ఇక ద‌గ్గు విష‌యానికి వ‌స్తే త‌మ‌ల‌పాకు ద‌గ్గుకు దివ్య ఔష‌దం అని చెప్ప‌వ‌చ్చు. త‌మ‌ల‌పాకును నూరి ర‌సం తీయాలి. అర‌చెంచా ర‌సంలో తేనే క‌లిపి నాలుక‌పై రాయాలి. చిన్న‌ పిల్ల‌ల‌కు జ‌లుబుతో ముక్కు మూసుకుపోయి ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది ప‌డుతుంటే మ‌రిగించిన నీళ్ల‌లో కాస్త ఉప్పు వేసి ఆ నీటిలో ముంచి ముక్కులో చుక్క‌లుగా వేస్తే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. చేతి గుడ్డ లేదా శుభ్రమైన పల్చని వస్త్రంపై కొంచెం విక్స్‌ పూసి చిన్న పిల్లల దగ్గర ఉంచితే ఆ వాసన పీల్చుకుంటారు. శ్వాస మంచిగా ఆడుతుంది. కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం వేసి కరిగించాలి. ఇలా చిన్నపిల్లల ఛాతీపై మృదువుగా రాస్తే హాయిగా అనిపిస్తుంది. మంచిగా ఆరోగ్యంగా ఉంటారు.