బ్రహ్మకమలాలు ఇన్నిపూయడం అపూర్వం!

కేదార్ నాథ్, బదరీనాథ్ మందిరాలకి ఇంకా పైన, మంచు విరివిగా ఉండే లోయల్లోనే బ్రహ్మకమలాలు పూస్తాయి. శ్రావణ, భాద్రపద మాసాలలో వీటిని కోసుకువస్తూ ఉంటారు. ఈసారి, కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని వాతావరణకాలుష్యం పూర్తిగా మాయమైంది. పైన మంచుకొండల్లో బ్రహ్మకమలాలు విరబూసాయి. ఇలా పూయడం మునుపెన్నడూ లేదనీ , ఇంత సువాసన తామెన్నడూ చూడలేదని అక్కడికి వెళ్ళినవారు చెబుతున్నారు.