భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలకు బ్రేక్​

రామూలోరి క‌ల్యాణంపై కరోనా ప్రభావం
భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలకు బ్రేక్​!

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం
చలువ పందిళ్ల ఏర్పాట్ల నిలిపివేత
ఎటువంటి ఆర్భాటం లేకుండా సీతారాముల కల్యాణం

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో నిర్వహించాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలకు బ్రేక్ పడింది. భద్రాద్రిలో చలువ పందిళ్ల ఏర్పాట్లను నిలిపివేశారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తులు కూడా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. కాగా, వచ్చే నెల 2వ తేదీన శ్రీరామ నవమి. ఈ ఏడాది ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మాత్రమే సీతారాముల కల్యాణం జరుగనుంది.