కరోనాలో BRO బ్రిడ్జి రికార్డు

దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ వున్ప‌ప్ప‌టికీ స‌రిహ‌ద్దు ర‌హ‌దారుల సంస్థ (BRO) అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని సుబాన్ సిరి న‌దిపై గ‌ల డ‌పారిజో బ్రిడ్జిని పున‌ర్ నిర్మించింది. కోవిడ్ -19వైర‌స్ నిరోధానికిగాను అన్నిరకాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఈ బ్రిడ్జిని నిర్మించారు.

ఇది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వున్న ముఖ్య‌మైన వార‌ధుల్లో ఒక‌టి. డ‌పారిజో వార‌ధి ఇండియాకు చైనాకు మ‌ధ్య‌న వ్యూహాత్మ‌క లింకు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ్లాల్సిన అన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు, నిర్మాణ రంగ వ‌స్తువులు, మందులు ఇలా అనేకం ఈ బ్రిడ్జి ద్వారానే ర‌వాణా అవుతాయి. పాత బ్రిడ్జికి చీలిక‌లు ఏర్ప‌డ‌డంతో ప్ర‌మాదం సంభ‌వించ‌వ‌చ్చ‌నే ముందు చూపుతో దాన్ని తొల‌గించారు. గ‌తంలో అంటే 1992 జులై 26న భారీ ప్ర‌మాదం జ‌రిగి బ‌స్సులోనివారంద‌రూ చ‌నిపోవ‌డం జ‌రిగింది.

అలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌కుండా వుండ‌డానికి ఈ సారి పాత బ్రిడ్జి స్థానంలో కొత్త‌దాన్ని నిర్మించారు. అధికారులు వెంట‌నే స్పందించడంతో నిధులు విడుద‌ల‌య్యాయి. ఈ ఏడాది మార్చి 17న బిఆర్ టిఎఫ్ ప‌నిని ప్రారంభించింది. 27 రోజుల త‌ర్వాత అంటే ఏప్రిల్ 14న ఇది తిరిగి వినియోగంలోకి వ‌చ్చింది. 24 టన్నుల స్థాయినుంచి 40 టన్నుల స్థాయికి దీన్ని అప్ గ్రేడ్ చేశారు. త‌ద్వారా భారీ వాహ‌నాలు కూడా దీనిపైనుంచి వెళ్ల‌డానికి ఆస్కారం ఏర్ప‌డింది. దాంతో దీన్ని సైనికుల అవ‌స‌రాల‌కోస‌మే కాకుండా ఎగువ సుబాన్ సిరి జిల్లాలో చేప‌ట్టే మౌలిక వ‌స‌తుల నిర్మాణ కార్య‌క్ర‌మాల‌కోసం కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఈ రోజున దీన్ని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ పెమా ఖండు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. దాంతో ఈ రోజునుంచి దీనిపై ట్రాఫిక్ కార్య‌క‌లాపాలు మొద‌ల‌య్యాయి. బిర్వో, ఎంవోడి, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ధ్య‌న చ‌క్క‌టి స‌మ‌న్వ‌యం ఏర్ప‌డ‌డంతో చాలా వేగంగా బ్రిడ్జీని పూర్తి చేయ‌గ‌లిగారు.