హామ్మయ్యా ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ ప్రదేశంను బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసే వ్యూహాత్మక శ్రీనగర్ – లే రహదారిని సరిహద్దు రహదారి సంస్థ (BRO) ప్రారంభించింది.

దాదాపు 18 చమురు ట్యాంకులు మరియు ఇతర నిత్యావసర వస్తువులతో ఉన్న వాహనాలను జోజిలా పాస్ నుండి లే/ లడఖ్ వైపు వెళ్లేందుకు ప్రాధమికంగా అనుమతించారు. జోజిలా పాస్ వద్ద ఇటీవల మంచు కురిసినప్పటికీ ఈ వాహనాలకు అనుమతినిచ్చారు.

జోజిలా పాస్ వద్ద భారీగా మంచు కురుస్తూ ఉండడంతో గత ఏడాది డిసెంబర్ నుండి 524 కిలోమీటర్ల ఈ రహదారిని మూసి ఉంచారు. కేంద్ర పాలిట ప్రాంతమైన లడఖ్ లో నిత్యావసర వస్తువులు నిల్వ చేయవలసిన ఆవశ్యకత ఏర్పడడంతో లడఖ్ డివిషనల్ కమీషనర్ ఆదేశాల మేరకు రహదారిని తెరిచారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, 11,500 అడుగుల ఎత్తులో ఉన్న రహదారిపై తాజాగా పడిన మంచును ప్రాజెక్ట్ బీకాన్ మరియు ప్రాజెక్ట్ విజయక్ బృందాలు తొలగించాయి.

గత ఆరు దశాబ్దాల రికార్డును అధిగమిస్తూ ఈ ఏడాది అత్యధికంగా మంచు కురిసింది. మంచు తొలగించే కార్యక్రమాన్ని BROకు చెందిన ప్రాజెక్ట్ బీకాన్ బృందం గగన్ గిర్ నుండి జీరో పాయింట్ వరకు చేపట్టగా, జీరో పాయింట్ నుండి దాస్ వరకు ప్రాజెక్ట్ విజయక్ చేపట్టింది.