పతనంలో పయనిస్తోన్న షేర్ మార్కెట్

పతనంలో పయనిస్తోన్న షేర్ మార్కెట్

దేశీయ స్టాక్‌ మార్కెట్లు పతనంలో పయనిస్తున్నాయి. ఓవైపు కరోనా భయాలు మరోవైపు S బ్యాంకుపై ఆందోళనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సూచీలన్నీ భారీ నష్టాలు చూశాయి. BSE సెన్సెక్స్‌ 894 పాయింట్లు పడిపోయింది. ఓ సందర్భంలో 1,459 పాయింట్లు పడిపోయిన సూచీ చివరికి 893.99 లేదా 2.32 శాతం నష్టంతో 37,576.62తో ముగిసింది. NSE నిఫ్టీ 279.55 (2.48%) పాయింట్లు కోల్పోయి 10,989.45 వద్ద స్థిరపడింది.

భారతీయ రిజర్వు బ్యాంకు మారటోరియం విధిస్తూ కఠిన నిర్ణయాలు అమలు చేయడంతో స్ బ్యాంకు షేర్లు ఏకంగా 55 శాతం నష్టపోయి రూ.16.60 వద్ద ముగిశాయి. టాటా మోటార్స్‌ (9.5%), జెడ్‌ఈఈఎల్‌ (7.29), ఎస్‌బీఐ (6.48), టాటా స్టీల్‌ (6.44) షేర్లు నష్టపోయాయి. బజాజ్‌ ఆటో (1.53%), గెయిల్‌ (0.84), మారుతీ (0.43%), ఏసియన్‌ పెయింట్స్‌ (0.40), ఐచర్‌ మోటార్స్‌ (0.19) షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. షాంఘై, హాంకాంక్‌, సియోల్‌, టోక్యో స్టాక్‌ మార్కెట్లు 2 శాతం నష్టపోగా ఐరోపా సూచీలు ఉదయం నష్టాలతోనే ఆరంభమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడేలో 32 పైసలు తగ్గి రూ.73.24 వద్ద కొనసాగుతోంది.