ఎన్టీఆర్తో బుచ్చిబాబు తదుపరి సినిమా

ఎన్టీఆర్తో బుచ్చిబాబు తదుపరి సినిమా

ఈ రోజు ఒక హిట్టు కొడితే చాలు.. ఇక ఆ దర్శకుడికి అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోలు సైతం ఆ కొత్త దర్శకులతో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబుకు కూడా అలాగే అవకాశాలు వస్తున్నాయి.తాజాగా ఆయన రూపొందించిన తొలిచిత్రం ‘ఉప్పెన’ వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిక శెట్టిలకు ఆర్టిస్టులుగా మంచిపేరు తెచ్చింది. బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించింది. సత్తా వున్న దర్శకుడిగా అతనికి ఘనమైన పేరును మోసుకొచ్చింది.ఈ క్రమంలో బుచ్చిబాబుకి పలు ఆఫర్లు వస్తున్నాయి. అయితే, ఆయన తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ కోసం తాను తయారుచేసుకున్న కథను ఇటీవల ఆయనకు చెప్పాడనీ, అది ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో ప్రొసీడ్ అవమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.దీంతో బుచ్చిబాబు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్టును తయారుచేసే పనిలో వున్నాడట. ఇక ఇందులో ఎన్టీఆర్ ని స్పోర్ట్స్ మేన్ గా డిఫరెంట్ పాత్రలో దర్శకుడు చూపించనున్నట్టు సమాచారం. ఈ ఏడాదే ఇది సెట్స్ కి వెళుతుందని అంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.