నిహారిక పెళ్లికి స్పెషల్ ఫ్లయిట్ లో బన్నీ ఫ్యామిలీ పయనం

నిహారిక పెళ్లికి స్పెషల్ ఫ్లయిట్ లో బన్నీ ఫ్యామిలీ పయనం

మెగా కుటుంబాలన్నీ నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ చేరుకుంటున్నాయి. నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల వివాహం ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జరగనుంది. ఇప్పటికే నాగబాబు కుటుంబ సభ్యులు, చైతన్య కుటుంబ సభ్యులు చార్టర్డ్ విమానంలో ఉదయ్ పూర్ తరలివెళ్లారు. తాజాగా అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ పయనం అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట సందడి చేస్తోంది.మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికకు, గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహానికి ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ హోటల్ వేదిక కానుంది.