అస్సాంలో బస్సులు రోడ్డెక్కాయి..షరతులతో

మన దేశంలోని అస్సాం రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వం శనివారం అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ASTC) బస్సులను నడుపుతోంది. రాష్ట్రములో పలు గ్రీన్ జోన్ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన ప్రజల సౌకర్యం కోసం మూడు రోజుల పాటు అంతర్ జిల్లా ప్రయాణంలో భాగంగా ప్రారంభించింది. అయితే రెడ్ జోన్ జిల్లాల్లో ఉన్నవారు బయటకు వెళ్లలేరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల షరతులు అమలు అవుతాయి. గువహతిలోని ASTC బస్ స్టాప్ నుండి బస్సులు బయలుదేరాయి.