మేముసైతం 30వేల మంది వైద్యులు

కరోనా మహామ్మారిని తరిమికొట్టేందుకు మేముసైతం యుద్ధభేరీకి సిద్ధమని 30వేలకు పైగా విశ్రాంత ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, సైనిక వైద్య సేవకులు, ప్రైవేటు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కరోనా కోరలు పీకేందుకు సైనికుల్లా పోరాటం, సహాయం అందించేందుకు సిద్ధమని పేర్లు నమోదు చేసుకున్నారు. దేశంలో అధికారిక లెక్కల ప్రకారం 2500 కేసులు దాటేసిన దారుణ పరిస్థితులు నెలకొనడంతో నీతి ఆయోగ్‌ వెబ్‌సైట్లో మార్చి 25న ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏడు ఖండాల్లో కూడా వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఉండటంతో ఆయా దేశాల్లో కూడా ఈ విధంగానే ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడం జరిగింది.