భారతదేశంలో లాక్డౌన్ 21 రోజులు కాకుండా మరో రెండు దశలు అమలు చేయాలని కేంబ్రిడ్జ్ పరిశోధకుల అధ్యయనం
అభిప్రాయబడింది. సుదీర్ఘ లాక్డౌన్ కాకుండా ప్రతిసారి ఐదు రోజుల సడలింపుతో 28 రోజులు మరియు 18 రోజులు
మూడు విడతలు లాక్డౌన్ అమలు చేయాలని కరోనా అధ్యయనంలో పరిశోధకులు సూచించారు. దేశంలో ప్రకటించిన లాక్ డౌన్ యుద్ధం ఆరవ రోజుకు చేరుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మూడు వారాల లాక్ డౌన్ గడువును పొడిగించే అవకాశం ప్రస్తుతానికి ఏమీ లేదని కేంద్రం ప్రకటించింది. దేశ జనాభాతో అత్యధికంగా ఉండటంతో లాక్డౌన్ మూడు వారాలు చేయడంతో పూర్తిస్థాయిలో ఫలితం ఇవ్వదని పేర్కొన్నారు. సమాజంలో ప్రజలు వ్యక్తిగత నిర్బంధం, కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ లాంటి నిబంధనలు సమర్ధవంత అమలు సాధ్యమని అప్పుడే కేసుల నమోదు సంఖ్య తగ్గుందన్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని Applied Mathematics & thearatical Physics విభాగానికి చెందిన పరిశోధకులు రాజేష్ సింగ్, ఆర్ అధికారి ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. ఈ నెల 25న లాక్డౌన్ విధింపు, ప్రతి ఒక్కరినీ ఇళ్లకు పరిమితం చేయడం లాంటి పరిణామాల అనంతరం జరిగిన గణిత గణనల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు తెలిపారు.
నాలుగు దశల్లో వేర్వేరు నియంత్రణ ప్రోటోకాల్స్‌ను పరిగణనలోకి తీసుకుని మూడు లాక్ డౌన్లు అవసరమని గుర్తించినట్టు ఈ కేంబ్రిడ్జీ బృందం తెలిపింది. ఇందులో మొదటి దశగా ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తుంది తప్పితే.. మళ్లీ వ్యాప్తి చెందకుండా వుండేందుకు, కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఈ ఒక్క లాక్డౌన్ ప్రభావం పని చేయదని అభిప్రాయపడ్డారు.
లాక్డౌన్ పూర్తయినా తర్వాత మళ్లీ భారతదేశంలో కరోనా తిరిగి పుంజుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు.
ఇక రెండవ దశలో 21 రోజుల లాక్ డౌన్ తరువాత 5 రోజుల సడలింపు ఇచ్చి.. వెంటనే 28 రోజుల మరో లాక్ డౌన్ అమలు చేస్తే బాగుంటుందని సూచించారు. తగ్గిన కేసుల ఆధారంగా వైరస్ పునరుజ్జీవనాన్ని అంచనా వేయలేమని, అదొక్కటే పరిగణలోకి సరిపోదని పేర్కొన్నారు. మూడవ దశలో 28 రోజుల లాక్డౌన్ తరువాత మళ్లీ 5 రోజుల సడలింపు తరువాత 18 రోజుల లాక్డౌన్ విధించాలంటున్నారు.
అప్పుడే నాలుగవ దశలో పాజిటివ్ కేసుల 10 కంటే తక్కువకు వస్తాయని, స్పష్టమైన కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ చేయడంతోనే వైరస్ తిరిగి రావడాన్ని నిరోధించడం ప్రక్రియ విజయవంతం అవుతుందని తేల్చారు.