అత్యల్పంగా చమురు ధరలు నమోదు

కరోనా ప్రభావంతో 17 ఏళ్ల కనిష్ఠానికి చమురు ధరలు

కరోనా ప్రభావం, OPEC vs రష్యాల మధ్య ధరల పోటీ కారణంగా ముడి చమురు ధరలు పడిపోయి 25.83$కు చేరుకున్నాయి, ఈ ధరలు 17 ఏళ్ల కిందటి సంవత్సరం 2003 నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు, రైలు మరియు విమాన సర్వీసులు కూడా నిర్వహణ నిలిపేస్తుండటం, కోవిడ్19 కేసులు 4లక్షలకు చేరువవుతుండటం, మరణాలు 8వేలకు పైగా
నమోదవుడంతో ఆ ప్రభావం కారణంగా 2003
నాటి కనిష్ట స్థాయికి క్రూడ్ ఆయిల్ ధరలు నమోదయ్యాయి.

*US చమురు ధరలు పతనం 84 సెంట్స్ లేదా 3.12%,
2003 మే నాటి కనిష్ట స్థాయికి ఓ బ్యారెల్ ధర $25.83.
*బ్రెంట్ క్రూడ్ ధరలు పతనం 37 సెంట్స్ లేదా 1.29%,
2016 నాటి కనిష్ట స్థాయికి $28.05