యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు కారణం???

మనం గతం తవ్వి చూస్తే టీవీ షోలు వివాదాలకు దారితీస్తుంటాయి. అలా ఒక్కోసారి యాంకర్లపై కూడా పోలీసుల కేసులు నమోదవుతాయి. అలానే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ రన్నరప్, ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. అసలు ఈమెపై పోలీస్ కేసు నమోదు కావడానికి కారణమేంటి? ఏం చేసిందంటూ ఆరాలు తీస్తున్నారు. నల్లకుంటకి చెందిన శర్మ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు యాంకర్ శ్రీముఖితో పాటు ఓ ఛానెల్‌పై కేసు నమోదు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో జరిగే ఓ కార్యక్రమంలో శ్రీముఖి బ్రాహ్మణులను అవమాన పరిచినందుకు నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడు.

బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్, యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఉన్నారంటూ వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.