సీఎం జగన్ కు వ్యతిరేకంగా పోస్టు పెట్టిన జనసేన నేతపై కేసు నమోదు

సీఎం జగన్ కు వ్యతిరేకంగా పోస్టు పెట్టిన జనసేన నేతపై కేసు నమోదు

సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా చేసే పోస్టులపై ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టు చేశాడంటూ ఓ జనసేన నేతపై కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.జనసేన నేత మాగాపు ప్రసాద్ సీఎం జగన్ ను ఉద్దేశించి పోస్టు చేయగా, వైసీపీ నేత నల్లం శ్రీరాములు భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మాగాపు ప్రసాద్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో పలువురు టీడీపీ మద్దతుదారులపైనా ఇలాంటి కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు చేస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు చేస్తోంది.