అనుష్క నోట‌ క్యాస్టింగ్ కౌచ్ మాట‌..

అనుష్క నోట‌ క్యాస్టింగ్ కౌచ్ మాట‌..

క్యాస్టింగ్ కౌచ్‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌
-ఒక్క తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు. అన్ని చిత్ర పరిశ్రమలలో ‘కాస్టింగ్ కౌచ్’ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది హీరోయిన్లు తమకి జరిగిన అన్యాయం గురించి మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. అయితే ఇదే విషయంపై నటి అనుష్క మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని అభిప్రాయపడింది. అయితే తనకి ఎప్పుడు ఈ అనుభవం ఎదురుకాలేదని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీనిపైన స్పందించింది. ‘V’ సినిమాకి ముందుగా అనుకున్న హీరోలు ఎవరో తెలుసా? క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని నేను చెప్పలేను.. కానీ నాకు ఎప్పుడూ అది ఎదురుకాలేదు. ఎందుకంటే… ఎవరైనా సరనేను చాలా ముక్కుసూటిగా మాట్లాడుతాన.. ఇక ఓ మహిళ నుంచి ఇలాంటి ప్రతిఫలం ఆశించడం తప్పు. నాకు తెలిసి ఇది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం. చిత్ర పరిశ్రమలో అతి సులభంగా రాణించాలా?, కష్టపడి నిలదొక్కు కోవాలా?.. ఇలాంటి విషయాల్ని మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మహిళ నో చెబుతుందో.. అప్పుడే పురుషుడు మహిళల్ని గౌరవించడం ప్రారంభిస్తాడు” అని అనుష్క పేర్కొంది.
వారిపై చర్యలు తీసుకోండి.. మంత్రి కేటీఆర్‌కు సింగర్ సునీత విఙ్ఞప్తి !

-ఇక భాగమతి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క తాజాగా నటించిన చిత్రం.. ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అంజలి, షాలినీ పాండే, మాధవన్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను వ‌చ్చే నెల ఏప్రిల్‌ 2న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.