తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులకు ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సంబందించి అనుమతికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్లాస్మా థెరపీ ప్రస్తుతం కేరళలో ప్రయోగాత్మకంగా అమలవుతుండగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కాగా, హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ వైద్యానికి ఓ కమిటీని కూడా నియమించింది ప్రభుత్వం. ప్లాస్మా థెరపీ చికిత్స అందించడానికి ప్రత్యేక నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
కాగా తెలంగాణలో ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం నాటికి 983 కరోనా కేసులు నమోదు కాగా, 667 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. 291 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 25గా నమోదు అయ్యింది. కరోనా వైరస్ బాధితుల్లో ఆరోగ్యం క్షీణించేదశకు చేరుకున్నవారికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించున్నట్టు వైద్యవర్గాలు వెల్లడించాయి.