కేంద్రం రంజాన్ మాసంపై ఆదేశాలు

లౌకిక వాదం సామరస్యం అంటే “రాజకీయ ఫ్యాషన్” కాదని, ఇది భారత దేశం మరియు “భారతీయుల పరిపూర్ణ ప్యాషన్” (అభిరుచి) అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఈ సమగ్ర సంస్కృతి మరియు నిబద్ధత దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంతో ముందుకు నడిపిస్తోందని వివరించారు.

తాజాగా మీడియా సంభాషించిన మంత్రి నఖ్వీ, మైనారిటీలతో సహా పౌరులందరికీ రాజ్యాంగ, సామాజిక మరియు మతపరమైన హక్కుల భారత రాజ్యాంగం అందించిన నైతిక హామీ అని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం ద్వారా మన బలం ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనపడకుండా చూసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. సంప్రదాయ మరియు వృత్తిపరమైన భోగస్ బాషింగ్ బ్రిగేడ్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే కుట్రలో ఇప్పటికీ చురుగ్గా వ్యవహరిస్తున్నాయని, అలాంటి దుష్టశక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, వారి దుర్మార్గపు తప్పుడు సమాచార ప్రచారాన్ని ఓడించేందుకు ఐక్యంగా ముందుకు కదలాలని సూచించారు.

తప్పుడు సమాచారాన్ని సృష్టించే లక్ష్యంతో ఎలాంటి నకిలీ వార్తలు, కుట్రలు ఎదురైనా వాటిని ఐక్యతతోనే ఎదుర్కోవాలని సూచించారు. దేశ పౌరులందరి భద్రత, శ్రేయస్సు కోసం అధికారులు కృషి చేస్తున్నారని, ఇలాంటి పుకార్లు మరియు కుట్రలు కరోనాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలహీనపరిచే దుర్మార్గపు కుట్రలని, వీటిని ఓడించి, ఈ పోరాటంలో విజయం దిశగా ముందుకు సాగేందుకు ఐక్యంగా పని చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కులం, మతం మరియు ప్రాంతం లాంటి అడ్డంకులను అధిగమించి కరోనాపై పోరులో దేశమంతా ఐక్యంగా ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజలు ఇంట్లో ఉంటూనే రంజాన్ పండుగ జరుపుకోవాలి.

పవిత్ర రంజాన్ మాసంలో ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్న ప్రార్థనలు, ఇతర మతపరమైన ఆచారాలను ప్రజలు ఇంట్లో ఉంటూనే నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలు, ఇమామ్ లు, మత సామాజిక సంస్థలతో పాటు, ముస్లిం సమాజం సంయుక్తంగా నిర్ణయించినట్లు మంత్రి నఖ్వీ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మత పెద్దలందరి సమన్వయ సహకారంతో లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ మరియు సామాజిక దూరాలను కఠినంగా మరియు నిజాయితీగా అమలు చేసేలా 30కి పైగా రాష్ట్ర వక్ఫ్ బోర్డులు వ్యూహాత్మకంగా పని చేయడం ప్రారంభించాయని శ్రీ నఖ్వీ మీడియాకు తెలిపారు. మత మరియు సామాజిక సంస్థలు, ముస్లిం సమాజం మరియు స్థానికి పరిపాలన సహా దేశం మొత్తం కరోనాకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతోందని తెలిపారు.

మంత్రి నఖ్వీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు గత వారం సమావేశం నిర్వహించి, ఓ నిర్ణయం తీసుకున్నాయి. దీని ప్రకారం అన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డులు లౌక్ డౌన్, కర్ఫ్యూ మరియు సామాజిక దూరం నియమాలను కఠినంగా, నిజయితీగా అమలు పరచనున్నాయి. పవిత్ర రంజాన్ మాసంలో దేశ వ్యాప్తంగా 7 లక్షలకు పైగా నమోదైన మసీదులు, ఈద్గా, ఇమాంబాడా, దర్గా మరియు ఇతర మత, సామాజిక సంస్థలు రాష్ట్ర వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయి. భారతదేశంలో రాష్ట్రాల వక్ఫ్ బోర్డులను సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ నియంత్రిస్తుంటుంది. అంతే కాకుండా శ్రీ నఖ్వీ వివిధ ముస్లిం మత పెద్దలు మరియు వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నారు.

ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా దళాలు, పరిపాలనా అధికారులు, పారిశుధ్య కార్మికులతో మనం సహకరించాలన్న శ్రీ నఖ్వీ, ఈ కరోనా మహమ్మారితో సాగుతున్న పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వారంతా మన భద్రత మరియు శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను, వారి కుటుంబాలను మరియు సమాజాన్ని రక్షించడానికే ఇలాంటి కేంద్రాలు ఉన్నాయని ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా క్వారంటైన్ మరియు ఐసోలేషన్ కేంద్రాల గురించి వ్యాప్తి చెందుతున్న పుకార్లు మరియు తప్పుడు సమాచారాన్ని కూడా నిర్మూలించాలని సూచించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, అన్ని దేవాలయాలు, గురుద్వార, చర్చిలు మరియు దేశంలోని ఇతర మత, సామాజిక ప్రదేశాల్లో అన్ని మత, సామాజిక కార్యకలాపాలు మరియు సామూహిక సమావేశాలు ఆగిపోయాయని, అదే విధంగా దేశంలో ఉండే అన్ని మసీదులు మరియు ఇతర ముస్లిం మత ప్రదేశాల్లో జరిగే సామూహిక సమావేశాలు కూడా ఆగిపోయాయని శ్రీ నఖ్వీ తెలిపారు. ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు పవిత్ర రంజాన్ మాసంలో మసీదులు మరియు ఇతర మత ప్రదేశాల్లో సామూహిక సమావేశాలు నిషేధించాయని, వారి ఇళ్ళల్లోనే ఉంటూ మత పరమైన ప్రార్థనలతో పాటు ఇతర మతపరమైన బాధ్యతలు నెరవేర్చాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజల భద్రత మరియు శ్రేయస్సు కోసం సమర్థవంతంగా కృషి చేస్తున్నారని మంత్రి నఖ్వీ తెలిపారు. కరోనాకు వ్యతరేకంగా జరుగుతున్న యుద్ధంలో ప్రజల సహకారం భారతదేశానికి ఎంతో సాంత్వన కలిగించిందని, కానీ ఇప్పటికీ దేశం ముందు అనేక సవాళ్ళు ఉన్నాయని, వీటిని ఎదిరించాలనే మనం పూర్తి నిజాయితీతో ప్రభుత్వం సూచించిన నియమాలు పాటించాలని మంత్రి నఖ్వీ సూచించారు.