NRIs కు విమానాలు సిద్ధం చేసిన కేంద్రం

ఇతర దేశాలలోన్న భారతీయులకు గుడ్ న్యూస్. మే 7నుంచి మే13 వరకు వివిధ దేశాల నుండి భారతీయులను తీసుకురావడానికి 64 విమానాలను ఏర్పాటు చేశామని సివిల్ ఏవియేషన్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.

64 విమానాలలో యుఎఇ- 10 ఖతార్ -2, సౌదీ అరేబియా- 5, యుకె- 7, సింగపూర్- 5, యునైటెడ్ స్టేట్స్ -7, ఫిలిప్పీన్స్- 5, బంగ్లాదేశ్- 7, బహ్రెయిన్ – 2, మలేషియా -7, కువైట్- 5, ఒమన్ -2 ఉన్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

ఈ ప్రయాణానికి నిర్ణయించిన రేట్లు పరిశీలిస్తే లండన్-ముంబైకి రూ .50 వేలు, లండన్ నుండి అహ్మదాబాద్, లండన్ నుండి బెంగళూరు లండన్ నుండి ఢిల్లీ వరకు ఉంటుంది. చికాగో-ఢిల్లీ-హైదరాబాద్‌కు సుమారు రూ .1 లక్ష రూపాయల వరకు ఉంటుంది. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

Full details Click Here