కేంద్రం భారీ కరోనా ప్యాకేజ్

కేంద్రం భారీ వరాలు…కరోనా ఎఫెక్ట్

దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ స్థాయిలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. జాతీయ స్థాయి మీడియా ప్రతినిధుల సమావేశంలో నిత్యావసరాలైన ఆహార అవసరాలు, నిరుపేదల సహాయం కోసం మోడీ సర్కారు
‘గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌’ పేరుతో లక్ష 70వేల కోట్లు ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పేద కార్మికులను ఆదుకోవడం అలాగే శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి 50 లక్షలరూపాయలు ప్రత్యేక భీమా ధీమా సదుపాయం కపిస్తామని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన కరోనా ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేయండి.

కేంద్రం ప్రకటించిన అంశాలు.
1. కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సహాయం
2. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం
3. 15వేల కంటే జీతం తక్కువున్న 90% మంది ఉద్యోగులకు
ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లింపులు.
PF డబ్బు నుంచి 75% విత్‌డ్రా చేసుకునే అవకాశం.
4. కరోనా కట్టడికి పని చేస్తున్న వైద్య సిబ్బందికి 50లక్షల ఆరోగ్య భీమా
5. 80 కోట్ల మందికి మూడు నెలలు రేషన్‌
6. 5 కేజీల బియ్యం లేదా గోధుమలకు అదనంగా 5KGs
అలాగే 1Kg పప్పు సరఫరా.
7. పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ
8. PM కిసాన్‌ పధకం రైతులకు ఏడాదికి 6వేలు. తొలి విడతలో 2వేలు రైతుల ఖాతాల్లో జమచేస్తారు.
9. ఉపాధి హామీ పథకం వేతనం 202 రూపాయలకు పెంపు
10. వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా వెయ్యి రూపాయలు.
11. జన్‌ధన్‌ అకౌంట్‌ మహిళలకు మూడు నెలలు 500₹.
12. ఉజ్వల పథకంలో ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు
13. డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు
14. భవన నిర్మాణ కార్మికుల కోసం 31వేల కోట్లు కేటాయింపు.
15. ఇప్పటికే రాష్ట్రాలకు కేటాయించిన మినరల్‌ నిధులను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకునేందుకు అనుమతి ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన కరోనా ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేయండి.