కరోనా కట్టడిపై కేంద్ర మంత్రివర్గం

కరోనాపై కేంద్ర మంత్రివర్గం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర
కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా
వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులకు సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించామని
మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కరోనా కట్టడికి జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు, నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

త్వరలోనే మనదేశంలోని 80 కోట్ల మందికి 3₹ కిలో బియ్యం,
2₹ కిలో గోధుమలు సరఫరా చేయబోతున్నమన్నారు. దేశంలో ప్రజలకు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో అందుబాటులో ఉంటాయన్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసారు. ఏప్రిల్‌ 14 వరకూ దేశమంతటా లాక్‌ డౌన్‌ అమల్లో ఉండబోతోంది.