వలస కార్మికులకు ప్రత్యేక రైళ్ల సదుపాయంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్-3 నిర్ణయానికి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను, యాత్రికులను, విద్యార్ధులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకరిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు. టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. వలస కార్మికులు, విద్యార్ధుల తరలింపు సమయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు ఫాలో అవ్వాల్సిందే. ట్రక్కులు, వస్తువుల రవాణా వాహనాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదని కూడా కేంద్ర హోం శాఖ తెలిపింది.