కోవిడ్19 వైరస్ మార్గదర్శకాలు జారీ చేసిన నరేంద్ర మోడీ సర్కారు.

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కోవిడ్19 వైరస్ మార్గదర్శకాలు జారీ చేసిన నరేంద్ర మోడీ సర్కారు.

కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ కట్టడికి మార్గదర్శకాలు జారీ చేసింది. కార్యాలయాల్లోకి ప్రవేశ ద్వారాల దగ్గర థర్మల్ స్క్రీనింగ్ స్కానర్లు, తప్పనిసరిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. కరోనా వ్యాధి లక్షణాలు కనబడితే చికిత్స అందిస్తూ ఐసోలెట్ సెంటరుకు తరిలించాలి. ఎప్పటికప్పుడు కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను కట్టడి చేయాలి.
ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే విసిటర్ పాసులను వెంటనే రద్దు చేయాలి. అధికారుల అనుమతితో వచ్చే సందర్శకులను స్ర్కినింగ్ తరువాతే లోనికి అనుమతించాలి.

సమావేశాలను వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితం చేయాలి. తప్పనిసరయితే తప్ప వీలైనంత తక్కువ మందితోనే ప్రభుత్వ సమీక్షలు, సమావేశాలు నిర్వహించాలి. అవసరం లేని అధికారిక ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. అవసరమైన సమాచారం ఫైల్స్, డాక్యుమెంట్ల రూపంలో ఇతర కార్యాలయాలకు పంపించవద్దు. అవసరమైతే మెయిల్ సౌకర్యం ఉపయోగించుకోవాలి. కార్యాలయం ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచే దరఖాస్తులు తీసుకోవడం ఇవ్వడం చేయాలి.


ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉన్న జిమ్స్, శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేయాలి. ఉద్యోగులు పనిచేసే చోట తరుచుగా శుభ్రం చేయాలి, శానిటేషన్ చేసుకోవాలి
ప్రభుత్వ కార్యాలయంలోని వాష్ రూమ్, టాయిలెట్లను రెగ్యులర్ గా శానిటైజర్, సోప్ లు నిరంతరం నీటి సరఫరా చేయాలి. అధికారులకు అందరికి సలహా మీ ఆరోగ్యం మీరే పరిరక్షణ చేసుకోవాలి. శ్వాస సంబధమైన ఇబ్బందులు, జ్వరం, అస్వస్థత ఉంటే ఉద్యోగ స్థానం నుంచి వెళ్లిపోవాలి. తరువాత ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి.
వ్యక్తిగతంగా ఇంటిలోనే ఉన్నవారి విజ్ఞప్తితో వెంటనే ఉన్నతాధికారులు సెలవు మంజూరు చేయాలి. సీనియర్ ఉద్యోగులు, మహిళా, గర్భిణీ ఉద్యోగులు సీరియస్ కండిషన్ ఉన్న ఉద్యోగులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచాన్ని
కరోనా మహమ్మారి వణికిస్తోండటంతో 31లక్షల మంది కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది.