కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు : మోడీ సర్కారు నిర్ణయం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు : మోడీ సర్కారు నిర్ణయం.

నరేంద్రమోడీ సర్కారు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. అలాగే పెన్షనర్లకు కూడా లబ్ధి చేకూరనుంది. శుక్రవారం కేబినెట్ సమావేశంలో కమలం సర్కార్ డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. దీంతో డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచింది. 2020 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుండటంతో 35లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 25 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది పొందనున్నారు. కేంద్రమంత్రి వర్గ సమావేశంలో కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం చివరిగా గతేడాది అక్టోబర్ నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌ను (DA Hike) పెంచింది. అప్పుడు డీఏ 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 12 నుంచి 17 శాతానికి పెరిగింది. డీఏ పెంపు వల్ల దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం కలిగిది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.16,000 కోట్ల భారం పడింది.

అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనం, ఫిట్‌మెంట్ పెంపు కోసం డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. కేంద్ర సర్కార్ ఇదివరకు కనీస వేతనాన్ని రూ.18,000కు పెంచింది. అయితే ఉద్యోగులు మాత్రం రూ.26,000 కనీస వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి వర్గం మాత్రం ఈ డిమాండ్లకు స్పందించడం లేదు.