కేంద్రం పెట్రోల్ ₹10, డీజిల్ ₹13 సుంకం పెంపు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు 10, డీజిల్‌పై 13రూపాయలు పెంచింది. మార్కెటులో ఈ సుంకం రేటు మార్పులు 2020 మే6 నుండి అమల్లోకి వస్తాయి. ఓ వైపు OPEC అండ్ రష్యా దేశాలు ప్రచ్ఛన్న పోరు కారణంగా క్రూడాయిల్ ధరలు అధఃపాతాళానికి పడిపోయాయి. ప్రపంచ మార్కెటులో చివరకు మైనస్సులోకి ముడి చమురు ధరలు వెళ్లిన ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం కరోనా కాలంలో చూస్తున్నాము. కానీ మన దేశంలో మాత్రం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలతో దినదినం ధరలు పెంచుకుంటూ పోతున్నాయి.