స్టార్టప్‌లకు అండగా కేంద్రం
చిన్న స్థాయి స్టార్టప్‌లు, కొత్త సంస్థలు సహా సూక్ష్మ, చిన్న తరహా రంగంలో రుణగ్రహీతలకు రుణ సంస్థలు అందించే పరపతి సౌకర్యాలకు సంబంధించి హామీలను ఇవ్వడానికి ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూక్ష్మ, చిన్నతరహా సంస్థల కోసం రుణ హామీ మూలధన పథకం రూపంలో ఒక పథకాన్ని కలిగి ఉంది.
కొత్త ఎంఎస్ఎంఇ ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి ఆమోదం అవసరం లేదు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మంత్రిత్వ శాఖ పథకాన్ని అమలు చేసేందుకు, ఎంఎస్ఎంఇలకు అన్నిరకాలుగా మద్దతును అందించేందుకు మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్యాలయాలు ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర ఎంఎస్ఎంఇ శాఖ మంత్రి నారాయణ్ రాణె లోక్ సభలో నేడు అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.