భారతదేశంకు ముప్పు పొంచి ఉంది.

భారతదేశంకు ముప్పు పొంచి ఉంది. కిషన్ రెడ్డి

మన దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుతో జనతా కర్ఫ్యూ అందరూ పాటించారు. ఒక్కరోజుతో కరోనాని కట్టడి చేయలేము మార్చి 22వ తేదీ ఎలా చేసారో ప్రతిరోజు అలాంటి చర్యలే తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. దేశంలో అన్ని రాష్ట్రాలు
లాక్ డౌన్ ప్రకటించాయి కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు
సంబరంలా షాపింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ సూచనలను పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యంగా రోడ్ల పైకి వచ్చి గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ప్రపంచానికి పట్టిన మహమ్మారి
నుంచి కాపాడుకోవాలంటే స్వీయ పరిరక్షణ అవసరం. ప్రపంచమంతటా అప్రకటిత యుద్ధము సూక్ష్మక్రీములతో అంతకు మించి తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయులు అందరూ ఓ సైనికుడిలా కరోనా వైరస్‌ కట్టడి కోసం యుద్ధం చేసే పరిస్థితి నెలకొంది. ఇటలీలో నెలకున్న భయనమైన పరిస్థితులు తెలుసుకుని అర్థం చేసుకోవాలి.
దేశంలో లాక్ డౌన్ అనేది చాలా తక్కువ సందర్భలో ప్రకటిస్తారు కానీ మనము ఇప్పుడు ప్రకటించాము అంటే ప్రజలు వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ వైరస్ భీభత్సాన్ని, భయోత్పాతాలను సృష్టింస్తోంది. అమెరికా, చైనా, జపాన్, ఇటలీలాంటి దేశాలు శాస్త్ర సాంకేతికంగా, వైద్యపరంగా అత్యాధునిక సౌకర్యాలు, అభివృద్ధి చెందిన దేశాలు అయినప్పటికీ మృతుల వేగంగా వేల సంఖ్యల్లో నమోదవుతున్నాయి. అలాంటప్పుడు మన దేశంలో జనాభా 125కోట్లు పైనే కాబట్టి మనమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జాగ్రత్తలు పాటించాలి.
అమెరికాలో మార్చి 4 నాటికి 158 కేసులు ఉండేవి. కేవలం
16 రోజుల్లోనే 41,126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 487 మంది మృత్యువాత పడ్డారు. అత్యాధునిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, వైద్యపరంగా మౌలిక వసతులు కలిగిన దేశాలు, జనాభా తక్కువ ఉన్న దేశాలు కూడా కరోనాను తట్టుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే జనాభాలో 2వ స్థానంలో ఉన్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, ఇంకా మురికివాడలు, బస్తీలున్న మన దేశంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్రమైన ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉంది. మన దేశంలోకి కరోనా ఆలస్యంగా ప్రవేశించింది. చైనా సరిహద్దు దేశమైనా, చైనాతో వ్యాపార లావాదేవీలున్నా ఈ వైరస్ మనదేశానికి ఆలస్యంగా చేరుకుంది. జనాభా ఎక్కువగా, మౌలిక వసతులు తక్కువగా ఉన్న మనదేశంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వైరస్ సోకింది. ఇప్పుడిప్పుడే రెండో దశ మొదలైంది. నాకు రాదు అనే భావన తగదు. వైరస్‌కు ధనిక-పేద, గ్రామం-నగరం అనే తేడా ఉండదు. దేశంలోని
అన్ని ప్రభుత్వ, ప్రవైట్ ఆస్పత్రుల్లో విధులకు హాజరవ్వాలి అలాగే కరోనా టెస్టులు చేయాలని సూచనలు జారీ చేసాము.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రలు, అధికారులతో, మీడియా వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 15,24,266 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించాం. కమ్యూనిటీ సర్వైలెన్స్ కింద విదేశాల నుంచి వచ్చి ఇళ్లల్లో ఉన్నవారిని క్వారంటైన్ చేశాం. ఇప్పటి వరకు ప్రతిరోజూ 20,000 మందికి కరోనా టెస్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాము. ఇతర దేశాల్లోని 2,040 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురాగలిగాము. ఎప్పటికప్పుడు పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కరోనా కేసులు రీ-కన్ఫర్మేషన్ చేస్తున్నాం. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.