తెలంగాణలో కరోనా పోరాటంపై పర్యటనలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల పై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ డిటేల్డ్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కేంద్ర ప్రతినిధుల బృందం రాష్ట్ర పర్యటన లో భాగంగా శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సమావేశం అయింది.

కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి అరుణ్ భరోకా ఆద్వరంలో, ప్రజా ఆరోగ్య సీనియర్ స్పెషలిస్టు డా.చంద్రశేఖర్, ఎన్.ఐ.ఎన్ డైరెక్టర్ డా.హేమలత, నేషనల్ కన్సూమర్ అఫెర్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్.ఠాకుర్ , నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అసోసియేట్ ప్రో. శేఖర్ చతుర్వేది లు సభ్యులుగా
ఈ బృందంలో ఉన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయం తో పని చేసేందుకు కోవిడ్ మేనేజ్ మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేసామని వారికి తెలిపారు.

రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, కంటైన్ మెంట్ జోన్ ల నిర్వహణ, క్వారంటైన్ సెంటర్లు , అసుపత్రుల సన్నద్దత, నిఘా బృందాలు ఏర్పాటు (సర్వేలెన్స్) , వైద్య పరీక్షలు (టెస్టింగ్) , హెల్ప్ లైన్ (టెలిఫోన్) తో , వైద్య పరికరాల సేకరణ, తెల్ల రేషన్ కార్డు లబ్ది దారులకు ఉచిత బియ్యం పంపిణీ, వలస కార్మికులకు అన్నపూర్ణ సెంటర్లు, Shelter Homes, తదితర అంశాలపై వివరణాత్మకంగా కేంద్ర బృందానికి వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యమని , పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని, లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని అన్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కేంద్ర బృందానికి తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర అధికారుల బృందం ప్రశంసించింది.

ఈ సమావేశంలో అరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
శాంతి కుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమీషనర్ సత్యనారయణ రెడ్డి, ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ , భూ పరిపాలన శాఖ డైరెక్టర్ రజత్ కుమార్ సైనీ, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ 19 అధ్యయనంపై కేంద్ర బృందం ఆదివారం షెడ్యూల్ కూడా ఖరారైంది. ఉదయం డీజీపీ ఆఫీస్. ఆ తరవాత కంటైనమెంట్ జోన్ల పరిశీలన, ప్రస్తుతం క్వారెంటైన్ సెంటర్ గా ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రి పరిశీలన, మధ్యాహ్నం హోటల్ తాజాకృష్ణ లో లంచ్. 3 గంటలకు మెహిదీపట్నం రైతుబజార్ పరిశీలన ఆ తర్వాత సాయంత్రం 4:30 కి మంగర్ బస్తీ దవాఖాన పరిశీలన. 5 గంటలకు నైట్ షెల్టర్ల విజిట్ చేయనున్నారు.