కేంద్రం కరోనాపై ప్రాంతీయ భాషల్లో ప్రచారం

చైనాలోని ఉహాన్‌లో బ‌య‌ట‌ప‌డిన కోవిడ్ -19 ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా వ్యాపించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ దీనిని మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఇది 204 దేశాల‌కు వ్యాపించింది. ఈ మ‌హ‌మ్మారి తో పాటే ప్ర‌జ‌ల‌లో దీనికి సంబంధించిన మూఢ‌న‌మ్మ‌కాలు, భ‌యాలు, అపోహలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఇలాంటి స‌మ‌యంలో అతి పెద్ద స‌వాలు ప్ర‌జ‌ల‌ను సామాజిక దూరంపాటించేలా చేయ‌డం, ఐసోలేష‌న్ , క్వారంటైన్‌, లాక్‌డౌన్ పాటించ‌మ‌ని చెప్ప‌డం.
సామాజిక దూరాన్ని మ‌న‌మెందుకు పాటించాలి? ఇందుకు సంబంధించిన అపోహ‌ల‌ను తొల‌గించి ప్ర‌జారోగ్య విష‌యంలో శాస్త్రీయ దృష్టితో ప్ర‌జ‌ల‌కు దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చి (టిఐఎఫ్ఆర్‌) స‌వివ‌ర‌మైన స‌మాచారాన్ని త‌యారుచేసింది..
ప‌రిశోధ‌కులు ప‌లు ప్రాంతీయ భాష‌ల‌లో యూ ట్యూబ్ వీడియోల‌ను రూపొందించి సామాజిక దూరం పాటించ‌డం వ‌ల్ల కోవిడ్ -19 వంటి వైర‌స్‌ల‌ను ఎలా అదుపు చేయ‌వ‌చ్చో వివ‌రించారు. ఈ స‌మాచారం వాషింగ్ట‌న్ పోస్ట్ లో ప్ర‌చురిత‌మైన హారీ స్టీవెన్స్ స‌మాచారం ఆధారంగా అందించారు.
విద్యార్థులు, కుటుంబాలు, ఫ్యాక‌ల్టీల స్వ‌చ్ఛంద స‌హ‌కారంతో 9 భాష‌ల‌లో ఈ స‌మాచారాన్ని ఇంగ్లీషు, హిందీ, బెంగ‌లి, కొంక‌ణి, మారాఠి, మ‌ల‌యాళం, ఒడియా, త‌మిళం ,తెలుగు ల‌లో తీసుకువ‌చ్చిన‌ట్టు టిఐఎఫ్ ఆర్ శాస్త్ర‌వేత్త ప్రొఫెస‌ర్ ఆర్నాబ్ భ‌ట్టాచార్య తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ స‌మాచారాన్ని గుజ‌రాతి, పంజాబి, హ‌ర్యాన్వి, అస్సామీ భాష‌ల‌లో వెలువ‌రించ‌నున్న‌ట్టు చెప్పారు.
క‌రోనా వైర‌స్ కు సంబంధించి ప్ర‌స్తుతం ప్ర‌చారంలో ఉన్న ర‌క‌రాల అపోహ‌ల‌ను కొట్టిపారేస్లూ వాస్త‌వ స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కుఅందించ‌డ‌మే టిఐఎప్ఆర్ ఆలోచ‌న‌. ఈ వ్యాధి విదేశాల‌లో పుట్టింది. దీనికి సంబంధించి మ‌నం మ‌న ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న పెంచ‌డానికి ఈ ప్ర‌య‌త్నం ఉప‌క‌రిస్తుంద‌ని డాక్ట‌ర్ భ‌ట్టాచార్య అన్నారు.

త‌దుప‌రి ద‌శ‌లో ఇంట్లో అందుబాటులో ఉండా మెటీరియ‌ల్‌తో మాస్క్‌లు త‌యారు చేయ‌డానికి టిఐఎఫ్ఆర్ బృందం ప‌నిచేస్తుంది. ఇందుకు పోస్ట‌ర్లు, వీడియోలు త్వ‌ర‌లోనే విడుద‌ల అవుతాయి. వైర‌స్ వ్యాప్తి వెనుక ఉన్న శాస్త్రీయ అంశాల‌ను వివ‌రించేందుకు , ప్ర‌జ‌ల‌లో అపోహ‌లు తొల‌గించేందుకు ప్ర‌జ‌ల‌తో ,శాస్త్ర‌వేత్త‌లు త‌మ అభిప్రాయాలు పంచుకునేందు టిఐఎఫ్ ఆర్ చాయ్ అండ్ వై పేరుతో ఒక ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది.