అక్కచెల్లెళ్ల ఆపన్న హస్తంపై MLA రోజా

రాష్టాన్ని చంద్రబాబునాయుడు మూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసినా కూడా ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఎలా ముందుకు వెళ్తున్నారో మనం కళ్లారా చూస్తున్నామన్నారు.

ఈ రోజు కరోనా మహమ్మారివల్ల రాష్ర్టానికి ఆదాయం లేకపోయినా అక్క చెల్లెళ్లను కాపాడాలి అని ఈ సున్నా వడ్డీ పధకాన్ని మళ్లీ అమలు చేస్తున్నారు. 90 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రాష్ర్టవ్యాప్తంగా వారి అకౌంట్లలోకి 1400 కోట్ల రూపాయలు రావడమనేది చాలా సంతోషించాల్సిన విషయం.ఒక మహిళగా మహిళలందరి తరపున నేను జగన్ గారికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. కరోనా సమయంలో ఆదాయం లేని సమయంలో ఏదైనా సాకులు చెప్పి తప్పించుకోవచ్చు.అలా తప్పించుకునే మనస్తత్వం కాకుండా ఎప్పుడూ కూడా ఆడపడుచులకు అన్నా,తమ్ముడిగా ఉండాలన్న CM జగన్ ఆలోచనను నేను అభినందిస్తున్నాను.

గతంలో 2016-2019 వరకు సున్నావడ్డీ ఇవ్వకుండా దాదాపు మూడువేల కోట్ల రూపాయలు చంద్రబాబు ఎగ్గొట్టి మోసం చేసిన విషయాన్ని టిడిపి మహిళానేతలు గుర్తుకుతెచ్చుకుంటే మంచిది.

చంద్రబాబు అసలు వడ్డీతో సహా మాఫి చేస్తామని ఎన్నికలలో హామి ఇచ్చి వారిని అప్పుల్లో ముంచేసి వెళ్లారు.వారికి జగన్ గారి గురించి మాట్లాడేందుకు అర్హత ఉందా అని అడుగుతున్నాను. ఇలా రాష్ర్టం అప్పుల్లో ఉన్నా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు అభినందించాల్సింది పోయి బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారు.

టిడిపి మహిళానేతలు గుర్తుపెట్టుకోవాల్సింది…కాల్ మనీ,సెక్స్ రాకెట్ లలో ఆడవారిని వ్యభిచార కూపంలోకి దించినపుడు మీరు మాట్లాడలేదు.డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 14 వేల కోట్ల రుణమాఫి చేయనప్పుడు మీరు మాట్లాడలేదు.వనజాక్షిలాంటి సిన్సియర్ ఎంఆర్ ఓ ఇసుకమాఫియా చేస్తున్న టిడిపి ఎంఎల్ ఏను పట్టుకుంటే ఆమెను తరిమేశారు.

అలాంటి మీరు CM జగన్మోహన్ కు చెప్పాల్సిన అవసరం లేదు.జగన్ ప్రభుత్వంలో మహిళలు రక్షణతో,గౌరవంతో ఉన్నారు.ఆర్దికంగా కూడా ఎదుగుతున్నారు. మేనిఫెస్టోలో మరో వాగ్దానం సున్నావడ్డీ పధకం,కరోనా వ్యాప్తి చెందుతున్న సమయం,ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజలకు సహాయాలు అందిస్తున్న సమయంలో మహిళలగురించి ఆలోచించి 1400 కోట్ల రూపాయలు ఇవ్వడం మామూలు విషయం కాదు.

నగరి నియోజకవర్గానికే 11 కోట్ల 26 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా ప్రజలందరికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ భగవంతుడు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించాలి. కరోనా వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి,మాస్కులు ధరించాలి.చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు MLA రోజా తెలిపారు.