కేసీఆర్‌కి చ‌ంద్ర‌బాబు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు

కేసీఆర్‌కి చ‌ంద్ర‌బాబు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినోత్స‌వం జ‌రుపుకుంటోన్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు దేశంలోని పలువురు నేత‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేసీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. కేసీఆర్ ఎల్ల‌ప్పుడూ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. కేసీఆర్‌కి టీడీపీ నేత‌ లోకేశ్ కూడా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆయ‌న ఎల్ల‌ప్పుడూ సంతోషంగా ఉండాల‌ని ట్వీట్ చేశారు.కేసీఆర్‌కు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు.జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన నాయుకులు, ప్ర‌ముఖుల‌కు కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వారి ప్రేమ, అభిమానం క‌ల‌కాలం ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.