CM జగన్మోహన్ కరోనా సమీక్షలు/ప్రణాళికలు

అమరావతిలో కోవిడ్‌ నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్‌ విస్తరణ, నమోదవుతున్న కేసులు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, వివిధ అధ్యయనాలపై సమాలోచనలు/ప్రణాళికలు సిద్ధం చేసారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యలపై వివరాలు అందించిన అధికారులు.

ఉదయం 9 గంటలవరకూ గడచిన 12 గంటల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదనే విషయాన్ని స్పష్టం చేసారు. ఢిల్లీ వెళ్లిన వ్యక్తులు, అలాగే వాళ్ల ప్రైమరీ కాంటాక్టుల వల్లే కేసుల సంఖ్య పెరగడానికి కారణాలని అధికారులు అభిప్రాయబడ్డారు. ఈ బృందానికంతటికి పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. కరోనా కేసుల వ్యక్తులను గుర్తించే విషయంలో రాష్ట్ర పోలీసు విభాగం పనితీరుపై డీజీపీ నేతృత్వంలో సిబ్బంది అద్భుతంగా పని చేయడంతో ఆ కుటుంభ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకునే అవకాశం వచ్చిందని అధికారులన్నారు.

కుటుంబ సర్వే సమగ్రంగా జరగాలి.
ఇప్పటికే జరిగిన మొదటి, రెండు రాష్ట్రంలోని కుటుంబాల వారీ సర్వేపై సీఎం ఆరా తీసారు. మూడోసారి జరుగుతున్న సర్వే, భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం మరో రెండు కేటగిరీలు అలాగే అదనపు ప్రశ్నలను సర్వేలో చేర్చారు. కుటుంబ సర్వే సమగ్రంగా జరిగేలా ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై సర్వేచేసి వివరాలు నమోదుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

1.రియల్‌టైం పద్ధతిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.
2. మొదటి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో గుర్తించినట్టుగా పేర్కొన్న 6,289 మందికూడా ఈసర్వేలో భాగంగా ఉండాలి.
3. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు చేయించాలి.
4. ఎక్కడ కూడా తప్పులకు జరగడానికి అవకాశాలు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి.
5. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలి.
6 కరోనాపై నిశితంగా సమీక్ష చేయాలి, ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి.
7. క్వారంటైన్లలో సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని, నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలను ఏర్పాటు చేయాలి.

వ్యవసాయం/రైతులపై సీఎం సమీక్ష.
వ్యవసాయంపై కోవిడ్‌ –19 ప్రభావం, రైతులకు అండగా తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష సమావేశంలో చర్చించారు.

1. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు పంట రావడం పెరిగితే తీసుకోవాల్సిన చర్యలు.
2. కోవిడ్‌–19 విపత్తు నేపథ్యంలో రవాణా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ.
3. ధాన్యం రవాణాకు ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
4. రవాణాలో కూడా నిల్వ చేయలేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
5. మిర్చి మార్కెట్‌ యార్డులను రెడ్‌జోన్, హాట్‌స్పాట్లకు దూరంగా వికేంద్రీకరణ చేయాలి.
6. ఉత్పత్తి ఉన్న చోటే మార్కెట్‌ యార్డులను పెట్టేదిశగా ఆలోచన చేయాలి.
7. రైతులు బయట మార్కెట్లో తమ పంటలను అమ్ముకోవాలని అనుకుంటే వారికి పూర్తిగా సహకరించేలా రవాణా సౌకర్యాలు కల్పించాలి.
8. రైతులకు మార్కెటింగ్‌ వ్యవస్థలో సహాయ సహకారాలు అందించాలి.
9. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీసుకునే చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ జరగాలి.
10. రైతులను ఆదుకునే చర్యల విషయంలో అధికారులు దూకుడుగానే ఉండాలి. నిర్లక్ష్యం వహించరాదు.
11. రాష్ట్రంలో పండే పండ్లను స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి అన్ని చర్యలూ తీసుకోవాలి.
12. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇప్పటికే అరటి పళ్ల విక్రయాన్ని ప్రారంభించామని, క్రమంగా చీనీ లాంటి పంటనూ స్థానికంగా గ్రామాల్లో అందుబాటులోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.