కరోనా కట్టడికి చిన్నారుల దాతృత్వం

కరోనా కల్లోలం పసి మనస్సులను కలచివేస్తోంది. ఎవరైన చుట్టుపక్కల చనిపోయారనే ఓ వార్తకే గజగజ వణికి పోయే పసి ప్రాణాలు ప్రపంచంలో 5,94344 వైరస్ సోకగా 27,251మంది కరోనా కాటుకు మరణించడంతో చలించిపోతున్నారు. అయ్యో పాపం మేమేమి చేయాలనే మనస్సుతో ఆలోచిస్తున్నారు. అందుకే తమ వంతు సహాయంగా ఆర్థిక విరాళాన్ని కిడ్డి బ్యాంకులో దాచుకున్నవి ప్రకటిస్తున్నారు. ఢిల్లీలో లాన్సర్ స్కూల్లో 12th క్లాస్ చదువుతోన్న Y. సంస్కృతి D/O Y. సత్యకుమార్ (తెలుగు అమ్మాయి) ప్రధాన మంత్రి సహాయ నిధికి రెండున్నర లక్షలు అందించింది. అలాగే సూర్యపేటకు చెందిన ఖ్యాతి అనే మరో అమ్మాయి కిడ్డి బ్యాంకులో దాచుకున్న 22 వేల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధికి పెద్ద మనసుతో అందజేసింది. హద్దులు లేకుండా సహాయం చేయాల్సిన ఈ అత్యవసర సమయంలో చిన్నారులు ముందుకు వచ్చి విరాళం చేయడమే కాకుండా అందరూ తమ శక్తికి తగిన విధంగా ఆర్థికంగా విరాళాలు దేశ సంరక్షణ కోసం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.