తెలుగు నేర్చుకుంటున్న చిలసౌ బ్యూటీ

అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా తెరకెక్కిన చిలసౌ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన రుహాని శర్మ లాక్ డౌన్ పుణ్యమాని తెలుగు నేర్చుకుంటుంది.లాక్‌డౌన్ కొంద‌రికి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇన్నాళ్లు తాము చేయాల‌నుకున్న‌ పనులు, నేర్చుకోవ‌ల‌సిన విద్య‌లు ఈ స‌మ‌యంలో చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన హిట్ మూవీ రుహాని ఖాతాలో మరో హిట్ చిత్రంగా నిలిచింది. రానున్న రోజుల‌లో రుహానీకి ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ఆఫ‌ర్స్ రానుండ‌గా, ఇందుకోసం తెలుగు నేర్చుకునే ప‌నిలో బిజీగా ఉందంట ఈ ముంబై భామ.

ఇంట‌ర్నెట్‌లో రోజుకి రెండు గంట‌లు తెలుగుతో కుస్తీ పడుతోందంట. అంతేకాక హైద‌రాబాద్‌లో ఉన్న త‌న ఫ్రెండ్ ద్వారా కూడా తెలుగుపై ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నం చేస్తుంది.ఇప్పటికే రుహానీ ఎంఎస్ రాజు డ‌ర్టీ హ‌రి, విష్ణు మంచు మోస‌గాళ్ళు, అవ‌స‌రాల శ్రీనివాస్ క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా వుంది.