కోవిడ్19 కారణంగా చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత

కోవిడ్19 కారణంగా చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత

చిలుకూరు బాలాజీ దేవాలయం కోవిడ్19 వైరస్ (కరోనా వైరస్) కారణంగా రేపటినుండి అనగా మార్చ్19 నుంచి 25వ తేది వరకు మూసివేయడం జరుగుతుంది. స్వామి వారి ఆరాధన మాత్రం రోజూ జరుగుతుంది, కానీ భక్తులకు అనుమతి లేదని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు తెలిపారు.

చిలుకూరు బాలాజీ దేవాలయ పంతులు పవన్ మాట్లాడుతూ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్, గోపాల కృష్ణ రంగరాజన్ పంతులు ఆదేశాల మేరకు రేపటి నుంచి మార్చ్ 25 వరకు ఆలయం మూసి ఉంటుందని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని షాపింగ్ మాల్స్ సినిమా హాళ్లు అన్ని మూసి వేయడం జరిగిందని అందుకే కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున మూసివేయడం జరుగుతుంది అని అన్నారు.

దేవాలయానికి వచ్చే భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుడికి చాలా మంది వస్తారని అందువలన వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని, ఇది చాలా మంచి నిర్ణయం అని అందరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.