కోవిడ్ 19 వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు

కోవిడ్ 19 వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో చైనాపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న వేళ అది వూహాన్‌ ల్యాబ్‌లోనే రూపుదిద్దుకుందంటూ ఇటీవల తెలిపిన చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌ యాన్‌ మరోసారి ఆ వైరస్‌పై కీలక విషయాలు చెప్పింది. కొవిడ్‌-19 వ్యాప్తి గురించి చైనా సర్కారుకు ముందే తెలుసని ఆమె తెలిపింది. అంతేగాక, ఈ సమాచారాన్ని కప్పిపుచ్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పింది.చైనాపై నింద పడకుండా చేయాలనుకుందని ఆమె ఆరోపించింది. తాను చెబుతోన్న ఈ విషయాలను నిరూపించడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది. తాను ఈ విషయాలను చెబుతుండడంతో  చైనా సర్కారు తనను సోషల్‌ మీడియా ద్వారా బెదిరించాలని చూస్తోందని ఆమె తెలిపింది. తన కుటుంబాన్ని కూడా భయపెడుతోందని చెప్పింది.కరోనా వైరస్‌ ఫుడ్‌ మార్కెట్‌ నుంచి రాలేదని, ల్యాబ్‌ నుంచే వచ్చిందని ఆమె తెలిపింది. ఈ వైరస్‌ను చైనా ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేసిందో, ఎందుకు బయటకు వచ్చేలా చేసిందో తాను ప్రజలకు తెలపాలనుకుంటున్నానని చెప్పింది. వూహాన్‌లో వైరస్‌ గురించి చేస్తోన్న పరిశోధనల్లో భాగంగా తనకు కొత్త విషయాలు తెలిశాయని తెలిపింది.