చైనా నుంచి స్వస్థలం చేరుకున్న తెలుగమ్మాయి.

చైనా నుంచి స్వస్థలం చేరుకున్న తెలుగమ్మాయి.

చైనా ఊహాన్ నగరంలో కరోనా కారణంగా అవస్థలు ఎదుర్కోన్న తెలుగు మహిళ అన్నెం జ్యోతి ఆంధ్రప్రదేశ్ అలాగే కేంద్ర ప్రభుత్వలా సహకారంతో సురక్షితంగా భారతదేశంకు చేరుకుంది. 14 రోజుల పాటు చావ్లాలోని ITBP మెడికల్ ఐసోలేషన్ క్యాంపులో ఉంచారు. కరోనా మెడికల్ పర్యవేక్షణలో ఎలాంటి వైరస్ సోకలేదని నిర్ధారణ అవడంతో డాక్టర్లు ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ జ్యోతి వివాహం గత నెల 14న జరగాల్సి ఉండగా కరోనా కారణంగా చైనాలోనే ఉండిపోవాల్సి రావడంతో వాయిదా పడింది.

ఈ అమ్మాయిని భారతదేశంలోని స్వస్థలం రప్పించేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేన నేతృత్వంలో OSD పి. రవిశంకర్ తదితరులు భారత్-చైనా విదేశాంగ శాఖలతో చర్చలు జరిపి సురక్షితంగా మనదేశానికి రప్పించడంలో కృషి చేసారు.