సోషల్ మీడియాలో చిరంజీవికి అభినందనల వెల్లువ

సోషల్ మీడియాలో చిరంజీవికి అభినందనల వెల్లువ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన వెంటనే ట్విట్టర్ మాధ్యమంలో RRR సినిమాపై స్పెషల్ ట్వీట్ చేశారు. RRR సినిమా స్పెషల్ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడంపై మెగాస్టార్ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ ట్వీట్ చూడగానే జూనియర్ ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అలాగే మాలయాళం సూపర్ హీరో మోహన్ లాల్, దర్శకుడు SS రాజమౌళి కూడా మెగాస్టార్ రాకకు ట్విట్టర్ లో స్వాగతం పలికారు. కరోనా కట్టడిపై ఇచ్చిన సందేశాన్ని కూడా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.