రామ్ చ‌ర‌ణ్ ‘సిద్ధా’ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన చిరు

రామ్ చ‌ర‌ణ్ ‘సిద్ధా’ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన చిరు

చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య సినిమా నుంచి మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ తేజ్ కు సంబంధించిన మ‌రో పోస్ట‌ర్ విడుద‌లైంది. చెర్రీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిరు ఈ పోస్టర్ ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో చెర్రీ సిద్ధా అనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.ఇంతకు ముందే రామ్ చరణ్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో అందులో చెర్రీ క‌న‌ప‌డ్డాడు. అనంత‌రం చిరు, చెర్రీ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫొటో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు వారిద్ద‌రికి సంబంధించి విడుద‌లైన తాజా లుక్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఇద్ద‌రూ రైఫిళ్లు ప‌ట్టుకుని పోరాటానికి వెళ్తున్న‌ దృశ్యానికి సంబంధించిన ఫొటో ఇది.ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ న‌టిస్తోంది. కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మే 13న ఈ సినిమా విడుద‌ల కానుంది. చెర్రీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.